News January 24, 2026

ఏలూరు: 2018లో మొదలైన హత్యాకాండ..!

image

ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి, విజయవాడకు చెందిన షేక్ అమనుల్లా బేగ్ మిత్రులు. వీరు జల్సాలు చేయడానికి ఈజీ మనీ సంపాదనపై పడ్డారు. చిన్న చిన్న దందాలతో వచ్చే చిల్లర చాలక మనుషుల ప్రాణాలు తీయడానికి నిర్ణయించుకున్నారు. మొదటిసారి 2018లో ముసునూరు (M) గోపవరానికి చెందిన ఉమామహేశ్వరరావును చంపడానికి స్కెచ్ వేశారు. బేగ్ తయారు చేసిన సైనైడ్‌ను సింహాద్రి ప్రసాదంలో కలిపి ఉమామహేశ్వరరావుకు ఇచ్చాడు. (1/2)

Similar News

News February 11, 2026

నిర్మల్: ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం

image

నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు అన్నిచోట్ల ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగక ఇటు ఎన్నికల అధికారులు.. అటు పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇద్దరు అధికారులు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. మరో పక్క జిల్లా పోలీస్ యంత్రాంగం ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

News February 11, 2026

జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

image

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

News February 11, 2026

రాయికల్: ఖండాంతరాలు దాటి వచ్చి ఓటేసిన యువకుడు

image

రాయికల్ పట్టణానికి చెందిన సింగని సురేశ్ అనే యువకుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి యూరప్ దేశం నుంచి వచ్చాడు. తన ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సురేశ్ లీవ్ పెట్టి మరి బుధవారం పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఖండాంతరాలు దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న సురేశ్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.