News February 28, 2026
ఏలూరు: 2,57,658 మందికి పెన్షన్లు పంపిణీ

ఏలూరు 17వ డివిజన్ గాంధీ మైదాన ప్రాంతంలో శనివారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 2,57,658 మందికి రూ.113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేసామన్నారు. ఇందుకు జిల్లాలో 5047 మంది వార్డు, గ్రామ సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బందితో పింఛన్లు పంపిణీ పక్కా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
Similar News
News March 2, 2026
నిర్మల్: రైతులకు 1,40,000 యూరియా బస్తాలు అందజేత

జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటివరకు రైతులు 1,60,000 వేల యూరియా బస్తాలు బుక్ చేసుకోగా 1,40,000 బస్తాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 2, 2026
ఖమేనీ అధీనంలో రూ.8.55లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం?

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సుమారు $95B (₹8.55లక్షల కోట్లు) విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తొలి సుప్రీం లీడర్ ఖొమేనీ స్థాపించిన ‘సెటాడ్’ అనే రహస్య సంస్థ పరిధిలో ఇది ఉందని పేర్కొంది. ప్రజల ఆస్తులను జప్తు చేసి విక్రయించేవారని, ప్రతి రంగంలో ‘సెటాడ్’కి వాటాలున్నాయని ఆరోపించింది. అయితే ఖమేనీ తాను రిచ్ అయ్యేందుకు సెటాడ్‌ను వాడుకున్నారనేందుకు ఆధారాల్లేవని పేర్కొంది.
News March 2, 2026
ఇంటర్ ఫస్టియర్ గణితం పరీక్షలకు 408 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం పరీక్ష జరిగింది. పరీక్షలకు సెట్-1 ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయుడు తెలిపారు. జనరల్ విద్యార్థులు 13,890 గాను 13,621 మంది హాజరు కాగా 269 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 2,258 గాను 2,119 మంది హాజరు కాగా 139 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.


