News March 20, 2025

ఏలూరు: 4,060,14 గృహాలకు కుళాయి కనెక్షన్: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్ అందించే కార్యక్రమంలో భాగంగా మొత్తం 4,74,978 గృహాలకుగాను, 4,060,14 గృహాలకు కుళాయి కనెక్షన్ అందించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం తెలిపారు. మిగిలిన గృహాలకు కూడా నిర్దేశించిన సమయంలో కుళాయి కనెక్షన్లు అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 21, 2025

ఇవాళ రాత్రికి మంత్రి ఫరూక్ సతీమణి అంత్యక్రియలు

image

మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ ఇవాళ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో, అందులోనూ ఇవాళ శుక్రవారం కావడంతో ఈ రాత్రికే ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫిలింనగర్‌లోని మంత్రి నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. రాత్రి 8 గంటలకు HYDలోని ఆగాపుర, పాన్‌మండి ఖబరస్తాన్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.

News March 21, 2025

అనకాపల్లి: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ వివరాలను కలెక్టర్ వివరించారు. నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ పూర్ణిమాదేవి పాల్గొన్నారు.

News March 21, 2025

BIG UPDATE.. త్వరలో 55,418 పోస్టుల భర్తీ!

image

TG: రాష్ట్రంలో కొలువుల జాతర మొదలుకానుంది. త్వరలోనే 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. అంగన్వాడీ, గ్రామ పరిపాలన అధికారులతో పాటు హోం, వైద్యారోగ్య, విద్యా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్థిక శాఖతో చర్చలు జరిపిన తర్వాత వీటిపై నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే 58,868 పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

error: Content is protected !!