News March 20, 2025

ఏలూరు: 4,060,14 గృహాలకు కుళాయి కలెక్షన్లు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్ అందించే కార్యక్రమంలో భాగంగా మొత్తం 4,74,978 గృహాలకుగాను, 4,060,14 గృహాలకు కుళాయి కనెక్షన్ అందించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం తెలిపారు. మిగిలిన గృహాలకు కూడా నిర్దేశించిన సమయంలో కుళాయి కనెక్షన్లు అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 17, 2025

గోదావరిఖని: గోవాకు ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ

image

గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి గోవాకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు గోదావరిఖని బస్టాండ్ నుంచి స్లీపర్ బస్ బయలుదేరుతుంది. ఈ ప్యాకేజీలో మురుడేశ్వర్, గోకర్ణ, గోవా పర్యటనలు ఉంటాయి. ఒక్కరికి ₹7,500 చొప్పున ఛార్జ్ నిర్ణయించారు. నగరానికి 28న తిరిగి చేరుకుంటారని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. రిజర్వేషన్ల కోసం 7013504982, 7382847596 నంబర్లలో సంప్రదించవచ్చు.

News September 17, 2025

NRPT: ప్రజా చైతన్యం.. ఆర్యసమాజ్ పోరాటం

image

నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపై ఆర్య సమాజం గట్టిగా పోరాడింది. 1892లో హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్‌లో స్థాపించిన ఆర్య సమాజ్ శాఖ, నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించింది. 1944లో నిజాం రాష్ట్రీయ ప్రజా సమితి (NRPT) సమావేశాలు ఈ పోరాటాన్ని మరింత బలపరిచాయి. ఈ చారిత్రక సంఘటనలు సమాజంలో మార్పు కోసం ఆర్య సమాజం చేసిన అకుంఠిత కృషిని ప్రతిబింబిస్తాయి.

News September 17, 2025

KMR: జెండా ఎగరవేసిన ఎస్పీ

image

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయన మాట్లాడుతూ.. ఐక్యతతోనే విజయాన్ని సాధించగలమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు.