News December 22, 2025
ఏలూరు: ‘92.34 శాతం పల్స్ పోలియో పూర్తి చేశాం’

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని డీఎంహెచ్వో అమృతం స్పష్టం చేశారు. 2,00,004 మంది చిన్నారులకు 1,84,685 (92.34%) మంది పిల్లలకు మ్యానువల్‌గా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. పల్స్ పోలియో నుంచి ఒక పిల్లవాడు కూడా తప్పిపోకుండా కృషి చేస్తున్నామన్నారు. 22, 23వ తేదీల్లో హౌస్ టు హౌస్ కార్యక్రమంలో నూరు శాతం పూర్తయ్యాల కృషి చేస్తామన్నారు.
Similar News
News December 23, 2025
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు

విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇచ్చే ఉచిత ‘ఐఎల్టీఎస్’ (IELTS) శిక్షణ దరఖాస్తు గడువును జనవరి 11 వరకు పొడిగించినట్లు వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎం. అనిల్ ప్రకాష్ తెలిపారు. అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన కల్పించే ఈ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
News December 23, 2025
వనపర్తి : ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు రూ.2వేల ఆలస్య రుసుముతో ఈనెల 31 వరకు గడువు పొడిగించినట్లు వనపర్తి డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఇది ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులతో పాటు వృత్తి విద్య కోర్సుల విద్యార్థులకు, ప్రైవేట్ అభ్యర్థులకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. పరీక్ష రుసుమును కళాశాల స్థాయిలో మాత్రమే వసూలు చేసి, నిర్దేశించిన తేదీలోపు ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్ మోడ్‌తో చెల్లించాలన్నారు.
News December 23, 2025
సిరిసిల్ల: జిల్లా పోలీసు కార్యాలయంలో కాకా వర్ధంతి

క్రమశిక్షణ, నైతికత, నిరంతర సేవా దృక్పథానికి మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి (కాకా) జీవితమే నిదర్శనమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. కాకా వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎస్పీ ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. కాకా సుదీర్ఘ కాలం పాటు ఎంపీగా, కేంద్రమంత్రిగా నిరుపేదల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు.


