News September 14, 2025
ఏలూరు: DSPల పనితీరుపై IG సమీక్ష

ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రొబేషనరీ DSPల పనితీరుపై సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. లాండ్ ఆర్డర్ విభాగంలో నిర్వర్తించిన విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి అనుభవాలను ఆలకించి తగిన సూచనలు సలహాలు తెలియచేశారు. సమర్థవంతమైన అధికారులుగా ఎదిగి ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని IG ఆకాంక్షించారు. ఏలూరు SP, కోనసీమ SP, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 14, 2025
ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి

ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో భారత్ ఓడిపోయింది. తొలుత భారత మహిళల జట్టు 281/7 రన్స్ చేసింది. ప్రతిక (64), స్మృతి (58), హర్లీన్ (54) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 44.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లిచ్‌ఫీల్డ్ 88 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. మూనీ 77 రన్స్‌తో రాణించారు.
News September 14, 2025
మునుగోడు: యువతి సూసైడ్

తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులకు వెళ్లాలని తల్లి మందలించగా మునుగోడు మండలం చెల్మెడకు చెందిన భవాని (25) పురుగుల మందు తాగింది. చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News September 14, 2025
మంచిర్యాల:అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

మంచిర్యాల మున్సిపాలిటీలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపల్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.