News January 30, 2025
ఏలేరు కాల్వలో కొనసాగుతోన్న గాలింపు

అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకొండ వద్ద ఏలేరు కాల్వలోకి బొలెరో వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంత మంది ఉన్నారనే విషయాలపై అనకాపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వాహనంలో మరొకరు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 29, 2025
నల్గొండ: రేపు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని SFI ఎంజీయూ కార్యదర్శి కర్రెం రవికుమార్ కోరారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఎంజీయూ కమిటీ ఆధ్వర్యంలో ఉపకులపతి కాజా అల్తాఫ్ హుస్సేన్‌కు బంద్ నోటీసును అందజేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని.. ఈనెల 30న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలు బంద్ పాటిస్తాయని రవికుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
News October 29, 2025
భారీ వర్షంతో తొలి టీ20 రద్దు

ఆస్ట్రేలియా-భారత్ మధ్య కాన్‌బెర్రాలో జరిగే తొలి టీ20 రద్దయింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. 9.4 ఓవర్లలో 97/1 రన్స్ చేసింది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటవ్వగా.. గిల్ 37*, సూర్య 39* దూకుడుగా ఆడారు.
News October 29, 2025
అర్ష్‌దీప్ బదులు హర్షిత్.. నెటిజన్ల ఆగ్రహం

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ బదులు హర్షిత్ రాణాను ప్లేయింగ్-11లోకి తీసుకోవడంపై నెటిజన్లు టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు. హర్షిత్‌కు గంభీర్ సపోర్ట్ ఎక్కువగా ఉందని, బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ఫైర్ అవుతున్నారు. దీనిపై మీ కామెంట్?


