News October 25, 2025

ఏలేరు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

image

ఏలేరు ప్రాజెక్ట్ నుంచి మూడు వేల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ శనివారం ప్రకటించారు. ప్రజలు ముంపునకు గురికాకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News October 26, 2025

నల్గొండ: మద్యం దుకాణాలకు ఈ నెల 27న డ్రా

image

2025- 27కు సంబంధించి నల్గొండ జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రమణ తెలిపారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో గల లక్ష్మి గార్డెన్స్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ఎంపిక లాటరీ ద్వారా జరుగుతుందన్నారు. డ్రా ప్రారంభ సమయంలో మీడియాకు అనుమతి లేదని, డ్రా పూర్తిగా ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు అందజేస్తామన్నారు.

News October 26, 2025

రామాయంపేట: GREAT.. 56వ సారి రక్తదానం

image

రామాయంపేట పట్టణానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56వ సారి రక్తదానం చేశారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 56వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఎస్పీ అభినందించారు.

News October 26, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.