News October 13, 2025

ఏలేశ్వరం: గోతుల దారిలో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్

image

ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి రాజవొమ్మంగి మండలంలోని చెరుకుంపాలెం వరకు రోడ్డు అద్వాన్నంగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం రాజవొమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళుతున్న ఆర్టీసీ బస్సు టైర్ బోర్నగూడెం వద్ద ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు దారుణంగా ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 13, 2025

మరికాసేపట్లో వర్షం

image

తెలంగాణలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని IMD తెలిపింది. కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో ఇవాళ కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

News October 13, 2025

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ చేయించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

News October 13, 2025

TTD డైరీలు వచ్చేశాయ్! ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

image

2026కు సంబంధించి TTD క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తెచ్చింది. భక్తుల సౌకర్యార్థం వీటిని ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఇవి వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులోని TTD కళ్యాణ మండపాల్లో అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ శ్రీవారి ఆలయంతో పాటు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన ఎస్వీ ఆలయాల్లో కూడా కొనుగోలు చేయవచ్చు.