News January 7, 2026
ఏసీఏ లక్ష్యం క్రికెట్ స్టేడియాల అభివృద్ధి: ఎంపీ కేశినేని

విజయవాడలో నూతనంగా నిర్మించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్, సెక్రటరీ సతీష్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. వైజాగ్, మంగళగిరి, మూలపాడు, కడప క్రికెట్ స్టేడియాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన ధ్యేయమని తెలిపారు. అన్ని స్టేడియాలలో మౌలిక వసతులు కల్పించి, మరిన్ని మ్యాచులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 13, 2026
అలియాబాద్‌లో హంగ్.. కింగ్ మేకర్‌గా BJP

అలియాబాద్లోని 20 వార్డుల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. కాగా, ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ నుంచి 8 మంది, BRS తరఫున ఏడుగురు, బీజేపీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఒకరు, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అయితే ఏ పార్టీకి కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో ఛైర్మన్ పదవి దక్కాలంటే BJP కింగ్ మేకర్‌గా మారింది.
News February 13, 2026
మున్సిపల్ ఫలితాలు.. భార్యాభర్తలు, తల్లీకొడుకులు విజయాలు

TG: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో భార్యాభర్తలు జయకేతనం ఎగురవేశారు. 13వ వార్డు నుంచి జూపల్లి రమేశ్, 6వ వార్డు నుంచి శశికళ కాంగ్రెస్ కౌన్సిలర్లుగా గెలిచారు. మెదక్ జిల్లా రామాయంపేటలోనూ భార్య లావణ్య (1వ వార్డు), భర్త నాగరాజు (7వ వార్డు) కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మరోవైపు మెదక్‌లో తల్లీకొడుకులు జయకేతనం ఎగురవేశారు. 17వ వార్డు నుంచి లలిత, 29వ వార్డు నుంచి ఉదయ్ BRS తరఫున గెలిచారు.
News February 13, 2026
కాంగ్రెస్ పార్టీకి షాక్

TG: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతున్న కాంగ్రెస్ పార్టీకి రెండు మున్సిపాలిటీల్లో ఫలితాలు షాకిచ్చాయి. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హవా కొనసాగించింది. అక్కడ 16 వార్డులకుగాను గులాబీ పార్టీ 9 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఏడు స్థానాలకే పరిమితమైంది. ఇక దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులుండగా ఇప్పటివరకు కాంగ్రెస్ ఒక్క వార్డులోనూ గెలవలేదు.


