News October 16, 2025

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

image

ఏసీబీ ముమ్మర దాడులు నిర్వహిస్తున్నా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. బుధవారం అనంతపురంలోని జెడ్పీ పరిషత్ క్యాంపస్‌లో సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, అటెండర్ నూర్ అక్రమ సంపాదన బాగోతం బట్టబయలైంది. లక్ష్మీనారాయణ రూ.10 వేలు, నూర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News October 16, 2025

విశాఖ: ‘పవన్‌ కళ్యాణ్‌ను కలిసేదాకా ఊరెళ్లను’

image

బెట్టింగ్‌ యాప్‌ల వల్ల తనలా ఎవరూ నష్టపోకూడదని సాయి కుమార్ అనే యువకుడు పాదయాత్ర చేస్తూ విశాఖ నుంచి మంగళగిరి జనసేన ఆఫీసుకు వెళ్లాడు. బెట్టింగ్ యాప్‌ల వలలో పడి రూ.20 లక్షలు నష్టపోయానని తెలిపాడు. మరొకరు ఇలా నష్టపోకూడదని అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ యాప్‌లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసు ముందు నిరసనకు దిగారు. పవన్‌ను నేరుగా కలిసి విన్నవించాకనే వెళ్తానంటున్నాడు.

News October 16, 2025

పోరాటం ఆపినప్పుడే నిజంగా ఓడినట్లు: విరాట్ కోహ్లీ

image

కోహ్లీ WC2027 వరకూ కొనసాగుతారా? లేక ఆలోపే రిటైర్ అవుతారా? అని చర్చ జరుగుతున్న వేళ రన్ మెషీన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడే మనం ఓడిపోయినట్టు’ అని పేర్కొన్నారు. దీంతో WC వరకు తాను కొనసాగుతానని, గివప్ చేసే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నెల 19నుంచి జరగనున్న AUS సిరీస్ కోసం కోహ్లీ ఆ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే.

News October 16, 2025

కామారెడ్డి: డీసీసీ అధ్యక్ష పదవికి పోటాపోటీ

image

డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఏడుగురు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. రామారెడ్డి మండలం పోసానిపేట నుంచి గిరి రెడ్డి మహేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి దరఖాస్తు చేసుకోగా, సదాశివనగర్ మండలం మర్కల్ నుంచి లింగా గౌడ్, భూమన్న దరఖాస్తు చేసుకున్నారు. లింగంపేట నుంచి షరీఫ్, రఫిక్, గాంధారి నుంచి ఆకుల శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి, ఐదుగురు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు.