News October 29, 2025
ఏసీబీకి చిక్కిన యాదాద్రి దేవాలయ అధికారి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్న అధికారి ఉప్పల్‌లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టు పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1,90,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న రామారావుకు సంబంధించిన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
Similar News
News October 30, 2025
మొంథా తుఫాను.. రేపు పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

AP: మొంథా తుఫాను నేపథ్యంలో YCP రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో రేపు ఉ.11 గంటలకు ఆ పార్టీ చీఫ్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుఫాను తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను జిల్లా అధ్యక్షులు ఆయనకు వివరించనున్నట్లు YCP వెల్లడించింది. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది.
News October 30, 2025
‘స్పిరిట్’లో డాన్ లీ?.. కొరియన్ మీడియాలో వార్తలు!

ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల రిలీజ్ చేసిన సౌండ్ స్టోరీలో డాన్ లీ గురించి ప్రస్తావించలేదు. దీంతో అవి పుకార్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో స్పిరిట్‌లో డాన్ నటిస్తున్నారని కొరియన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆయన కనిపించే తొలి ఇండియన్ మూవీ ఇదేనంటున్నాయి.
News October 30, 2025
BREAKING: హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

HYDలో దారుణ ఘటన వెలుగుచూసింది. బండ్లగూడలో బుధవారం రాత్రి ఓ పాన్ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసిన్ (22) ఓల్డ్ సిటీకి చెందినవాడు. ఇతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. నలుగురు గుర్తు తెలియని దుండగులు దుకాణం వద్ద కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


