News November 11, 2025

ఏసీబీ వలలో డోన్ డిప్యూటీ తహశీల్దార్

image

డోన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ రైతు పొలం సమస్య పరిష్కారానికి డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసి దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా సునీల్ రాజును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 11, 2025

ఆపరేషన్ సిందూర్ 2.0 స్టార్ట్ అవుతుందా?

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మహమ్మదే కారణమని నేషనల్ మీడియా చెబుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగిన మరో ఉగ్రదాడి ఇదే. దీంతో ‘భారత గడ్డపై మరోసారి దాడి జరిగితే సహించేది లేదు’ అని ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇచ్చిన హెచ్చరికలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దీంతో మరోసారి భారత్ యుద్ధం చేస్తుందా? అని పలువురు పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 11, 2025

మౌలానాకు నివాళులు అర్పించిన ఎస్పీ

image

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం నివాళులు అర్పించారు. దేశ తొలి విద్యామంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నిరక్షరాస్యత పేదరికం రూపుమాపడానికి అనేక సేవలు చేశారని వెల్లడించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు.

News November 11, 2025

నిజామాబాద్: ఆరుగురికి జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మంగళవారం తీర్పు చెప్పారని NZB ట్రాఫిక్ CI ప్రసాద్ తెలిపారు. ఇద్దరికి 4 రోజులు, మరో ఇద్దరికి 3 రోజులు, మరో ఇద్దరికి 7 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. అలాగే 28 మందికి రూ.2.69 లక్షల జరిమానా విధించినట్లు వివరించారు.