News December 10, 2024
ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ: KNR ఆర్టీసీ RM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఈ రాయితీ ఈనెల 1 నుంచి 31 వరకు ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని బస్సు సర్వీసుల్లో వర్తిస్తుందన్నారు. కావున, ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 15, 2025
కరీంనగర్: 24/7 తాగునీరు రావట్లే..!

ప్రజారోగ్య శాఖ అధికారుల అలసత్వంతో కరీంనగర్ పట్టణ ప్రజలకు 24/7 తాగునీరు అందడం లేదు. ఎల్ఎండీలో 23 టీఎంసీల నీరున్నా తాగునీటి సరఫరా ఎందుకు చేయడం లేదని నగరవాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి గంట మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలో 13వేల నల్లా కనెక్షన్లు ఉండగా 60వేల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అమృత్- 2 పథకంలో భాగంగా పట్టణమంతటా పైప్‌లైన్ల నిర్మాణం పూర్తయింది.
News September 14, 2025
కరీంనగర్ పీఏసీఎస్ లో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు డిఏఓ తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడోద్దన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
News September 14, 2025
KNR: సహకార సంఘాలకు పర్సన్ ఇన్ చార్జీల నియామకం

KNR జిల్లాలోని 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 సంఘాలకు గాను, 27 సంఘాలకు పాత PIC లనే కొనసాగిస్తూ, ఊటూర్, ఆర్నకొండ, గట్టుదుద్దెనపల్లి సంఘాల పదవీకాలాన్ని తిరిగి పొడిగించకుండా, వారిస్థానంలో సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్ చార్జీలను నియమించారు.