News November 10, 2024
ఏ.ఆర్.సీ.ఐలో రీసెర్చ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ బాలాపూర్ ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) సంస్థ రీసెర్చ్ అసోసియేట్స్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ఈ నెల 24 వరకు అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు https://www.arci.res.in/careers.html వెబ్సైట్ సందర్శించవచ్చు.
Similar News
News November 13, 2024
సీఎం రేవంత్ రెడ్డితో నెదర్లాండ్స్ రాయబారి భేటీ
నెదర్లాండ్స్ దేశ రాయబారి మరిసా జెరార్డ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీలోని వారి అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల పట్ల నెదర్లాండ్స్ రాయబారి జెరార్డ్ ఆసక్తి కనబర్చారు. ఈ భేటీలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ పాల్గొన్నారు.
News November 13, 2024
HYD: బైకులు ఎత్తుకుపోతున్నారు జాగ్రత్త..!
HYDలో 2024లోనే దాదాపు 1,400లకు పైగా వాహనాల చోరీ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. గతేడాది మొత్తం 1,400 చోరీల కేసులు నమోదైతే ఈ ఏడాది ఇప్పటికే 1,400 దాటడం గమనార్హం. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, ఇంటి ముందు పార్కు చేసినవి, కొన్నేళ్లుగా మూలకు పడి ఉన్న వాహనాలను ఎత్తకెళ్తున్నారు. అయితే బైకులకు అలారమ్, సెన్సార్లు ఏర్పాటు చేసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.
# SHARE IT
News November 13, 2024
HYD: మూసీపై MASTER ప్లానింగ్, డిజైన్లపై కసరత్తు!
HYD మూసీకి తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి వరకు 55KM మేర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నదికి ఇరువైపుల కిలోమీటర్ మేర గ్రోత్ ఏరియాగా గుర్తించారు. మొత్తంగా 125 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాణిజ్య కేంద్రాలు, రవాణా, లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ జోన్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. మరో నెలలో మూసీ డిజైన్లు పూర్తవుతాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.