News October 10, 2025
ఏ ఒక్క పత్తి రైతూ నష్టపోకుండా చూడాలి: VZM జేసీ

ఏ ఒక్క పత్తి రైతు నష్టపోకుండా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాదవన్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ ఛాంబర్‌లో శుక్రవారం జరిగింది. పత్తి రైతు ఈ-క్రాప్ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటా రూ. 8,110గా నిర్ణయించిందని, ఈ విషయాన్ని RSKల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
Similar News
News October 10, 2025
VZM: జిల్లా అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

విజయనగరం జిల్లాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ఎగ్జిబిషన్ కం సేల్ నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో శుక్రవారం వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. మండల స్థాయి, నియోజకవర్గం, మున్సిపాలిటీ & జిల్లా స్థాయిలో ఈ ఎగ్జిబిషన్‌లు జరగాలన్నారు. ప్రజలకు GST అవగాహనతో పాటు తక్కువ ధరల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 10, 2025
ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే: DRO

ఓటర్ల జాబితా సవరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిందేనని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో సవరణకు వచ్చిన దరఖాస్తులు 7 రోజుల్లోగా పరిష్కారం కావాలన్నారు. ప్రతి రోజు క్లెయిమ్స్‌పై AERO, సంబంధిత BLOలతో మాట్లాడాలని, ఏ రోజు క్లెయిమ్స్ ఆ రోజే పరిష్కరిస్తే పెండింగ్ ఉండవని చెప్పారు.
News October 10, 2025
VZM: ‘సూపర్ జీఎస్టీతో అన్నివర్గాలకు ప్రయోజనకరం’

అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కల్గించే విధంగా జీఎస్టీ శ్లాబులను ప్రభుత్వం సవరించిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి చెప్పారు. దీనిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో వాణిజ్య పన్నులశాఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ప్రదర్శన, విక్రయాలను శుక్రవారం ప్రారంభించారు.