News September 12, 2025
ఏ తల్లి నిను కన్నదో..!

ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లిన అమానవీయ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. పసికందు ఏడుపులు వినిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ICDS సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మానవత్వం లేని తల్లి ఈ ఘటనకు పాల్పడిందోనని ప్రజలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 12, 2025
MNCL: ‘కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసి ఆధ్వర్యంలో శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జేఏసి నాయకులు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని, లాభాల వాటా రూ.20 వేలు చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇందుకు డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
News September 12, 2025
బెల్లంపల్లి: ‘పనులను త్వరగా పూర్తి చేయాలి’

బెల్లంపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో అదనపు గదులు, మూత్రశాలల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
News September 12, 2025
HYD- గోవాకు ఎగిరిపోదాం పదా బ్రో

పర్యాటక ప్రేమికుల కోసం IRCTC కొత్త ఎయిర్ ప్యాకేజీలు ప్రకటించింది. HYD నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణికులను తీసుకెళ్లనుంది. 4, 5, 6, 8 రోజుల ప్యాకేజీలు తీసుకొచ్చింది. గోవా, గుజరాత్, కశ్మీర్, మేఘాలయ, కర్ణాకట, అండమాన్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలను చూపించనుంది. వీటితోపాటు థాయిలాండ్, శ్రీలంక దేశాలు కూడా ఉన్నాయి. వివరాలకు 040-27702407, 9701360701 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.