News October 13, 2025
ఏ విచారణకైనా నేను సిద్ధం: సుధీర్ రెడ్డి

మర్డర్ జరిగే వరకు రాయుడు ఎవరో తనకు తెలియదని శ్రీకాళహస్తి MLA సుధీర్ రెడ్డి అన్నారు. ‘నిన్ననే రాయుడి వీడియో చూశా. బెదిరించి వీడియో తీయించారా? లేక అది ఫేక్ వీడియో? అనేది తెలియాల్సి ఉంది. డిపాజిట్ కూడా రాని వినూత వీడియోలు తీసుకుని నేను ఏం చేస్తా. ఎన్నికల్లో నా కోసం వినుత దంపతులు పని చేయలేదు. ఏ విచారణకైనా నేను సిద్ధం. ఎక్కడికైనా వస్తా. ఇలా బురదజల్లే వారిని వదిలిపెట్టను’ అని ఢిల్లీలో MLA అన్నారు.
Similar News
News October 13, 2025
వనపర్తి: డీసీసీ బరిలో బలహీన వర్గాల నేతలు..?

వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవికి బలహీన వర్గాల వారే పోటీలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, లక్కాకుల సతీష్, న్యాయవాది డి.కిరణ్ కుమార్, మరో న్యాయవాది తిరుపతయ్య, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మాజీ కౌన్సిలర్ వెంకటేశ్ వర్గాలకు చెందినవారు అంటున్నారు. వనపర్తి డీసీసీ అభ్యర్థుల పరిశీలనకు రేపు స్టేట్ అబ్జర్వర్ వనపర్తి R&B గెస్ట్ హౌస్‌కు రానున్నట్లు చెబుతున్నారు.
News October 13, 2025
సూర్యాపేట: వృద్ధ దంపతుల ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు భూక్యా లచ్చు, వీరమ్మ ఆదివారం
రాత్రి ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మకూరు (ఎస్) మం. బోట్యా తండాలో ఈ విషాద ఘటన జరిగింది. అనారోగ్య సమస్యలే కారణమని వృద్ధ దంపతుల కుమారుడు మోహన్ తెలిపారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
News October 13, 2025
జిల్లా వ్యాప్తంగా 2 రోజులు భారీ వర్షాలు: కలెక్టర్

జిల్లాలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ వెట్రి సెల్వి ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దన్నారు. చెట్ల కింద, శిథిల భవనాల వద్ద ఉండవద్దని సూచించారు. ఉరుములు, మెరుపుల సమయంలో రైతులు పొలాలకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.