News February 18, 2026
ఐఎఫ్ఆర్ అంటే ఏమిటి?

International Fleet Review అనేది ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకచోట చేరి తమ యుద్ధనౌకలు, సాంకేతిక సామర్థ్యం, సముద్ర భద్రతలో సత్తాను ప్రదర్శించే ప్రతిష్టాత్మక నౌకాదళ కార్యక్రమం. దేశాల నౌకలు సముద్రంలో వరుసగా ప్రయాణిస్తుండగా, వాటిలోని సిబ్బంది ఆతిథ్య దేశ రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. నౌకాదళ సహకారం, భద్రత, వ్యూహాలపై దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతాయి. ఈసారి ఐఎఫ్ఆర్, మిలాన్, ఐఓఎన్‌ఎస్ కలిపి చేస్తున్నారు.
Similar News
News March 27, 2026
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై శుభవార్త

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కోసం దేశ ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచంలో ఏం జరిగినా రాబోయే <<19483054>>60 <<>>రోజులకు దేశంలోని ప్రతి పౌరుడికి సరిపడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందంది. ఆ తర్వాత 2 నెలలకు సరిపడా క్రూడాయిల్ దేశానికి వస్తోందని తెలిపింది. అలాగే US, రష్యా, AUS, ఇతర దేశాల నుంచి 8,00,000 టన్నుల LPG దేశానికి వస్తోందని.. వచ్చే నెల రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.
News March 27, 2026
ఆదిలాబాద్: పరీక్షల షెడ్యూల్ విడుదల

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం 2025-206 పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. PG మొదటి సంవత్సరం పరీక్షలు మేలో ఉంటాయని టైం టేబుల్ వెబ్ సైట్‌లో ఉందని వివరించారు. పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 13వ తేదీ వరకు అవకాశం ఉందని వెల్లడించారు.
News March 27, 2026
ఏలూరు: వేడుకలో గొడవ.. విద్యార్థిని ఆత్మహత్య..!

ఏలూరులోని ఓ ఫార్మసీ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు వీడ్కోలు వేడుకలో జరిగిన గొడవే కారణమని త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ప్రాథమికంగా నిర్ధారించారు. బుధవారం రాత్రి వేడుక అనంతరం భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి శివప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గురువారం వెల్లడించారు.


