News September 23, 2025
ఐఐఆర్ఎస్ఆర్ ఏర్పాటు ఇంకెప్పుడూ….?

టిష్యూ కల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేసి ఎర్రచందనాన్ని తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చే మొక్కగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖ 2022లో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎర్రచందన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంజూరు చేసినప్పటికీ, అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ల్యాబ్‌లో పరిశోధన దశలో ఉన్న ఎర్రచందనాన్ని రైతులు పెంచుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
Similar News
News September 23, 2025
బీటెక్, డిప్లొమా అర్హతతో 54 పోస్టులు

<
News September 23, 2025
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి: CM

TG: మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని CM రేవంత్ కోరారు. మేడారంలో మొక్కులు చెల్లించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సమ్మక్క-సారలమ్మ గద్దెల పునః నిర్మాణం చేపట్టడం మాకు దక్కిన గొప్ప అవకాశం. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం. రామప్ప ఆలయం స్ఫూర్తిగా రాతి కట్టడాలు నిర్మిస్తాం. కుంభమేళాకు ₹వేల కోట్లు కేటాయించిన కేంద్రానికి మేడారం జాతరపై వివక్ష ఎందుకు’ అని ప్రశ్నించారు.
News September 23, 2025
ఇక ఆ 29 సారా రహిత గ్రామాలు: కలెక్టర్

‘నవోదయం’ కార్యక్రమం ద్వారా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 8 మండలాల్లోని 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సారా రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్ఓ మాధవి పాల్గొన్నారు.