News October 31, 2025

ఐక్యత శిల్పి.. పటేల్ జ్ఞాపకాల్లో వరంగల్ చరిత్ర..!

image

భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కి వరంగల్ జిల్లాతో విశేష అనుబంధం ఉంది. 1948లో హైదరాబాద్ రాష్ట్ర విమోచన కోసం ఆయన ఆదేశాలపై ప్రారంభమైన ‘ఆపరేషన్ పొలో’ సమయంలో భారత సైన్యం వరంగల్ మార్గంగా ప్రవేశించి రజాకారులను తరిమికొట్టింది. పటేల్ దృఢనిశ్చయంతో వరంగల్ సహా తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో విలీనమవ్వడంతో ప్రజలు నిజమైన స్వేచ్ఛా వాయులను పీల్చుకున్నారు.

Similar News

News October 31, 2025

HYD: పటేల్‌కు నివాళులర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా HYDలోని గన్‌పార్క్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పటేల్ దేశ అభివృద్ధితో పాటు సమైక్యత కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు.

News October 31, 2025

బాపట్ల జిల్లాలో 80,467 ఎకరాల్లో పంట నష్టం..!

image

బాపట్ల జిల్లా పరిధిలోని 25 మండలాల్లో మొంథా తుఫాన్ ధాటికి 80,467 ఎకరాలలో ప్రాథమికంగా పంటకు నష్టం వాటిల్లందని జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. వరి 68,069 ఎకరాలు, మినుము 4,668, మొక్కజొన్న 3,506, పత్తి 3,257, కంది 507, శనగ 338.5, సోయాబీన్ 74.13, పెసర 32.22, నువ్వులు 4.94, జూట్ 5.9, జొన్న 5 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందన్నారు.

News October 31, 2025

జూబ్లీహిల్స్‌: రోజుకు 2 డివిజన్లలో సీఎం ప్రచారం

image

సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా ప్రచారం సాగనుంది. PJR సర్కిల్ నుంచి జవహర్‌నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ (చాకలి ఐలమ్మ విగ్రహం) వరకు రోడ్ షో.సాయిబాబా టెంపుల్ ఆవరణలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగం, సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా వద్ద మరో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు.