News March 12, 2025
ఐగాట్ కర్మయోగి కోర్సులను పూర్తిచేయాలి: కలెక్టర్

కేంద్రప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ కర్మయోగి భారత్ ద్వారా అందించే ఆన్‌లైన్ కోర్సులను ఈనెల 20వ తేదీలోగా పూర్తిచేసి, సర్టిఫికెట్లు పొందాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీనియర్ సలహాదారు ఎం.వెంకటేశ్వరస్వామితో కలిసి ఐగాట్ కర్మయోగి కోర్సులపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.
Similar News
News February 25, 2026
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ సెల్‌ఫోన్లను అనుమతించవద్దని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 25, 2026
నక్కపల్లి: ఈ తాజమహల్‌కు లిమ్కా బుక్‌లో చోటు

సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ మరో అరుదైన ఘనత సాధించారు. 2026 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు లభించింది. 4బీ పెన్సిల్ ముల్లుపై కేవలం 4 మి.మీ వెడల్పు, పొడవుతో అతి సూక్ష్మమైన తాజ్‌మహల్‌ను 6 గంటల పాటు శ్రమించి రూపొందించారు. నక్కపల్లి మండటం చినదొడ్డిగల్లుకు చెందిన వెంకటేశ్‌కు సంబంధించిన రికార్డు పత్రాన్ని మంగళవారం పోస్టల్ ద్వారా పంపారు.
News February 25, 2026
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 25)

* 1961-తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం * 1974-సినీ నటి దివ్యభారతి జననం(ఫొటోలో) * 1981-బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పుట్టినరోజు * 1998-ఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానాన్ని ఆల్ ఇండియా రేడియో(ఆకాశవాణి) ప్రవేశపెట్టింది * 2004-సినీ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి మరణం * 2010-స్వాతంత్ర్య సమరయోధుడు కాటం లక్ష్మీనారాయణ మరణం * 1973- డైరెక్టర్ గౌతమ్ మేనన్ పుట్టినరోజు


