News August 23, 2025

ఐటీఐ వాక్-ఇన్ అడ్మిషన్లు ప్రారంభం

image

ప్రభుత్వ ఐటీఐలో వాక్-ఇన్ అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, దరఖాస్తు చేయడానికి ఆగస్టు 28 చివరి తేదీ అని భూపాలపల్లి ఐటీఐ ప్రిన్సిపల్ జుమ్లానాయక్ తెలిపారు. పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు నేరుగా భూపాలపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ కేంద్రానికి తమ సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News August 23, 2025

హైదరాబాద్‌కు ‘HILLS’ ఇదీ రోడ్ల పరిస్థితి!

image

HYDలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటే తెలియని వారు ఉండరు. భారీ బిల్డింగ్‌లు, కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్ అందాలకు ఈ ఏరియాలు మారుపేరు. ధనికులు ఉండే ప్రాంతంగానూ పేరు పొందింది. కానీ.. ఇప్పుడు బంజరాహిల్స్ లాంటి ప్రాంతాల్లో రహదారులు గుంతల మయంగా మారి, అధ్వాన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు జీహెచ్ఎంసీ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది బంజారాహిల్స్ రోడ్ నంబర్- 12 పరిస్థితికి అద్దంపట్టే రోడ్డు ఫొటో.

News August 23, 2025

తిరుపతి హథీరాంజీ మఠం కూల్చివేతపై వివాదం

image

తిరుపతి హథీరాంజీ మఠం కూల్చివేతపై వివాదం రేగింది. భవనం శిథిలావస్థలో ఉందని, నివాసయోగ్యం కాదని ఐఐటీ నిపుణులు నివేదిక ఇవ్వగా కలెక్టర్ వెంకటేశ్వర్ నేడు మఠాన్ని పరిశీలించనున్నారు. మఠాన్ని కూల్చొద్దని, వారసత్వ కట్టడంగా కొనసాగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు చెందిన MLC కవిత స్పందిస్తూ.. కూల్చివేత బంజారాల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. కూల్చివేతపై అధికారులు పునరాలోచించాలని ఆమె కోరారు.

News August 23, 2025

కూకట్‌పల్లి: డబ్బుల కోసం వచ్చాడా? బ్యాట్ కోసమా?

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసు నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఓటీటీలో సినిమాలు చూసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లే స్పష్టం అవుతోంది. మరోవైపు దొంగతనం చేయడానికి ఇంట్లోకి రావడమే కాకుండా, ఓ బ్యాట్ గురించి ఈ హత్య జరిగినట్లు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు నేడు మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.