News January 28, 2025
ఐటీసీ ఎన్నికల్లో అనైతిక పొత్తులు

సారపాక ఐటీసీ కర్మాగారంలో ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. TDP, YSRCP అనుబంధ సంస్థలు పొత్తుతో ముందుకెళ్తున్నాయి. నిన్న ఇరుపార్టీల నేతలు కలిసి ర్యాలీ నిర్వహించడం గమనార్హం. అసలు ఇరుపార్టీలు పొత్తు ఉన్న సందర్భాలు ఎక్కడా లేవు. మరోవైపు ఈ అనైతిక పొత్తులు ఎవరి స్వలాభం కోసం? అనే చర్చ కూడా మొదలైంది.
Similar News
News November 6, 2025
మెట్‌పల్లి: రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: అదనపు కలెక్టర్

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ లత సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వాతావరణ మార్పు దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ అన్నారు. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఎమ్మార్వో, ఏపీఎం, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
News November 6, 2025
ఎస్‌బీఐ PO ఫలితాలు విడుదల

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <
News November 6, 2025
ఎలమంచిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఎలమంచిలి (M) కొక్కిరాపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివకాల మేరకు.. S రాయవరం (M) సర్వసిద్ధికి చెందిన అడబాల సాయిరామ్ గోవింద్ బైక్‌పై వెనుక కూర్చుని గ్రామం నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. సాయిరాం కింద పడిపోగా అతనిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గోవిందు సురక్షితంగా బయటపడ్డాడు.


