News October 26, 2025
ఐటీ కారిడార్‌పై ఆర్టీసీ ఫోకస్

ఐటీ కారిడార్‌పై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 82 లక్షల వాహనాలు తిరుగుతుండగా వాటిలో ఐటీ కారిడార్ వైపు ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అదనపు బస్సులు, సౌకర్యవంతమైన సర్వీసులు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్రాఫిక్ తగ్గించడంతో పాటు, ప్రయాణికులకు సులభతరం కల్పించే చర్యలు చేపట్టనున్నారు.
Similar News
News October 26, 2025
కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 26, 2025
వనపర్తి: ఆర్టీసీ సేవలు వినియోగించుకోండి- DM

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వనపర్తి డిపో నుంచి ఈనెల 27, 28, 29వ తేదీల్లో 30 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈనెల 28న ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం రోజున వనపర్తి, కొత్తకోట నుంచి 20 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. కాబట్టి భక్తులు ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకుని సురక్షితంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.
News October 26, 2025
రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు: APSDMA

AP: ‘మొంథా’ తుఫాను ఎల్లుండి రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. SKL, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూ.గో., ఏలూరు, NTR, GNT, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.


