News December 25, 2025

ఐటీ జాబ్ వదిలి వ్యవసాయం.. రోజూ రూ.15వేలు ఆదాయం

image

రూ.లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగం వదిలి.. సాగు బాట పట్టి సక్సెస్ అయ్యారు ఝార్ఖండ్‌‌లోని అంబతాండ్‌కు చెందిన యువరైతు ఉదయ్ కుమార్. బీటెక్ పూర్తి చేసి పుణేలో IT జాబ్ పొందిన ఉదయ్ సొంతూరిని వదిలి ఉండలేకపోయారు. 6 నెలలకే జాబ్ వదిలి, ఊరుకు వచ్చి 20 ఎకరాల్లో మిరప, టమాటా, క్యాబేజీ, బఠాణీ పండిస్తూ రోజూ రూ.15వేలకు పైగా ఆర్జిస్తున్నారు. ఉదయ్ పడ్డ కష్టాలు, సక్సెస్‌కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

Similar News

News December 25, 2025

3,073పోస్టులు.. ఆన్సర్ కీ విడుదల

image

<>స్టాఫ్<<>> సెలక్షన్ కమిషన్ CAPF, ఢిల్లీ పోస్ట్ విభాగంలో ఎస్సై పోస్టుల భర్తీకి డిసెంబర్ 9 నుంచి 12 వరకు నిర్వహించిన పేపర్ 1 పరీక్షల ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రర్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి షిఫ్ట్‌ల వారీగా ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరం ఉంటే DEC 27వరకు క్వశ్చన్‌కు రూ.50 చెల్లించి తెలుసుకోవచ్చు. SSC 3,073 పోస్టుల భర్తీకి OCT 16వరకు దరఖాస్తులు స్వీకరించింది.

News December 25, 2025

NCERT ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

NCERT 173 గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 27 – జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Lib.Sc, B.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 25, 2025

అధికారి ఆస్తి.. రూ.300 కోట్లు?

image

TG: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన DTC కిషన్ <<18655630>>వ్యవహారంలో<<>> కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని ఆస్తి విలువ రూ.200-300 కోట్లకు పైనేనని ACB వర్గాలు వెల్లడించాయి. డ్రైవర్ శివశంకర్, బంధువు విజయ్‌లను బినామీలుగా పెట్టుకున్నారని, కీలక డాక్యుమెంట్లన్నీ డ్రైవర్ వద్దే దాచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. కిషన్ కస్టడీ కోరుతూ ఇవాళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.