News March 25, 2024
ఐటీ శిక్షణ ఇప్పిస్తానని.. అఘాయిత్యం

కరీంనగర్‌కు చెందిన ఓ వివాహిత హైదరాబాద్ KPHPపరిధిలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్ శిక్షణలో చేరింది. శిక్షకుడు నరేంద్రకుమార్ ధ్రువపత్రాల తనిఖీ కోసం ఆమెను పిలిచి శారీరకంగా లోబరచుకున్నాడు. విషయాన్నిఆ మహిళ శిక్షణ తరగతుల సహచరుడు కృష్ణా జిల్లా వాసి సంతోష్‌కి తెలపడంతో అతను ఆమెను వేధింపసాగాడు. అది తట్టుకోలేక మహిళ నిద్రమాత్రలు మింగింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
Similar News
News September 5, 2025
ఉమ్మడి కృష్ణా నుంచి జాతీయ అవార్డులు పొందేది వీరే..!

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. మైలవరం లక్కిరెడ్డి హనుమ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి దేవానంద్ కుమార్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రొఫెసర్ విజయలక్ష్మి కాశీనాథ్ ఢిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందుకోనున్నారు.
News September 4, 2025
కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని వినతి

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను కోరారు. మచిలీపట్నం పర్యటనకు వచ్చిన మాధవ్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మాధవ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News September 4, 2025
కృష్ణా: యూరియా సరఫరాలో ఇబ్బంది ఉంటే.. ఇలా చేయండి.!

జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతుల అవసరాల కోసం ఇతర జిల్లాల నుంచి యూరియాను తెప్పిస్తున్నామని చెప్పారు. శుక్రవారం పల్నాడు జిల్లా నుంచి 300 మెట్రిక్ టన్నులు, పశ్చిమగోదావరి నుంచి 200 మెట్రిక్ టన్నులు వస్తాయని తెలిపారు. ఈ యూరియాను PACS ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని, సమస్యలు ఉంటే 08672-252572లో సంప్రదించవచ్చన్నారు.