News November 20, 2025

ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఆటో డ్రైవర్

image

ఎండాడకు చెందిన బొబ్బిలి రమేశ్ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలు, భార్యను పోషిస్తున్నాడు. ఈనెల 10న తన నివాసంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలలో తీవ్ర రక్తస్రావం అయ్యి ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా అంగీకరించడంతో అవయవాలను ఐదుగురికి అమర్చనున్నారు. కుటుంబసభ్యుల మంచి మనసును పలువురు మెచ్చుకున్నారు.

Similar News

News November 24, 2025

మూడు రోజులు గోదావరి జిల్లాలలోనే మంత్రి..!

image

మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం నుంచి 26వ తేదీ వరకు ఉభయగోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. సోమవారం ఉ.8. గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఏలూరు జిల్లా ఐఎస్ జ‌గ‌న్నాథ‌పురం చేరుకుంటారు. అక్కడ డిప్యూటీ సీఎంతో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం తూ.గో జిల్లా దేవరపల్లి, రాజమండ్రిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

News November 24, 2025

ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇండియన్<<>> హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE, B.Tech, ME, M.Tech, CA, CMA, ICAI, CFA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ihmcl.co.in

News November 24, 2025

ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.