News December 12, 2025

ఐదు దేశాలతో ‘C5’కు ప్లాన్ చేస్తున్న ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు శక్తిమంతమైన దేశాలతో ‘C5’ అనే కొత్త వేదికను ఏర్పాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్‌లతో ఈ గ్రూప్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ధనిక, ప్రజాస్వామ్య దేశాలకే పరిమితమైన ‘G7’కు భిన్నంగా, కోర్ ఫైవ్ (C5) దేశాలు ఇందులో ఉంటాయి. తద్వారా యూరప్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 17, 2025

50 శాతం మందికి వర్క్‌ఫ్రం హోం

image

ఢిల్లీలో <<18576427>>కాలుష్యం<<>> పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటిలో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

News December 17, 2025

విమర్శలకు భయపడేది లేదు: చంద్రబాబు

image

AP: మెడికల్ కాలేజీల అంశంపై విమర్శలకు భయపడేది లేదని కలెక్టర్ల సదస్సులో CM CBN తెలిపారు. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయన్నారు. 70% మందికి NTR వైద్యసేవలు అందడంతో పాటు విద్యార్థులకు సీట్లూ పెరుగుతాయని చెప్పారు. గతంలో రూ.500Crతో రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించి డబ్బులు వృథా చేశారని, అవి ఉంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించేవాళ్లమని CM వ్యాఖ్యానించారు.

News December 17, 2025

సేవింగ్స్‌ లేకపోతే ఇదీ పరిస్థితి

image

సేవింగ్స్ విలువను గుర్తు చేసే వాస్తవ కథ ఒకటి SMలో వైరల్‌గా మారింది. 35 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం కోల్పోయాడు. సదరు కార్పొరేట్ కంపెనీ ఖర్చుల తగ్గింపులో భాగంగా తొలగించేసింది. అయితే అసలు భయం ఏంటంటే అతడి వద్ద ఎటువంటి సేవింగ్స్ లేవు. ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు, అద్దె, EMIలు భారం అయ్యాయి. ప్రస్తుత రోజుల్లో ఏ కంపెనీలోనూ ఉద్యోగ భద్రత ఉండదని, యువత ఆ భ్రమ నుంచి బయటకు రావాలని అతడు సూచించాడు.