News February 7, 2026

ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల గూడ్స్‌.. US నుంచి ఇండియాకు!

image

వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి ఏకంగా 500 బిలియన్ డాలర్ల గూడ్స్‌ను ఇండియా కొనుగోలు చేయనుంది. ఇందులో ఇంధన ఉత్పత్తులు, ఎయిర్‌క్రాఫ్టులు, వాటి పార్టులు, విలువైన లోహాలు, టెక్నాలజీ ప్రొడక్టులు, కోకింగ్ కోల్ వంటివి ఉన్నాయి. డేటా సెంటర్లలో ఉపయోగించే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU)తో పాటు ఇతర టెక్నాలజీ ప్రొడక్టుల వాణిజ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

Similar News

News February 7, 2026

TENTH: ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.

News February 7, 2026

ముంబై: బీజేపీకి మేయర్, శివసేనకు డిప్యూటీ మేయర్

image

ముంబై మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.

News February 7, 2026

TISSలో ఉద్యోగాలు

image

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌(<>TISS<<>>) 11 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ(MCom)అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు రూ.125. నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tiss.ac.in