News August 18, 2025
ఐదేళ్ల MSC కోర్సులో ప్రవేశానికి వైవీయూ దరఖాస్తులు

యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో MSC ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంచాలకులు లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 8985597928, 9985442196 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News August 18, 2025
మైదుకూరు: విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి

మైదుకూరులోని పోరుమామిళ్ల రోడ్డులో ఎర్ర చెరువు సమీపంలో సోమవారం రాటాల పవన్ కుమార్ (38) అనే కౌలు రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వ్యవసాయం మోటార్ వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News August 18, 2025
చాపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి

చాపాడు మండలం బద్రిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి లారీకింద పడి స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News August 18, 2025
కడప: జలాశయాల్లో 44.55 TMCల నీటి నిల్వలు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 44.55 TMCల నీరు నిల్వగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. గండికోటలో 20.49 TMCలు, బ్రహ్మసాగర్‌లో 7.26, చిత్రావతిలో 4.96, మైలవరం5.11, పైడిపాలెం4.77, సర్వరాయసాగర్1, వామికొండ సాగర్ 0.96 TMCలు నీరు నిల్వగా ఉంది. బద్వేల్ ట్యాంక్, బుగ్గవంక, లోయర్ సగిలేరు తగినంత నీటితో రైతులకు ఊరట కలిగిస్తున్నాయి.