News March 5, 2025
ఐనవోలు: ఐలోని మల్లన్న హుండీ లెక్కింపు

ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ లెక్కింపు జరిగింది. ఆదాయం గత నెల 18 నుంచి ఈనెల 3 వరకు 44 రోజులకు గాను రూ. 42,64,669 వచ్చాయి. వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ. 1,35,94,297 ఆదాయం రాగా మొత్తం రూ. 1,78,58,966/- వచ్చాయని ఈవో తెలిపారు. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి, బంగారం తిరిగి హుండీలో భద్రపరిచామని తెలిపారు. ఇందులో టెంపుల్ ఈవో అద్దంకి నాగేశ్వరరావు వారి సిబ్బంది, ఐలోని కానిస్టేబుల్స్ ఉన్నారు.
Similar News
News July 6, 2025
జింబాబ్వేతో మ్యాచ్.. ముల్డర్ డబుల్ సెంచరీ

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ (264*) డబుల్ సెంచరీతో విజృంభించారు. 259 బంతులు ఎదుర్కొని 34 ఫోర్లు, 3 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. ఆట తొలి రోజే ముల్డర్ డబుల్ సెంచరీ బాదడం విశేషం. కాగా ముల్డర్ ఐపీఎల్‌లో SRHకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే ఒక మ్యాచ్ ఆడి 9 రన్స్ చేశారు.
News July 6, 2025
హెల్మెట్ ధరించి రక్షణ పొందండి: ఎస్పీ

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రక్షణ పొందాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై గోల్డెన్ అవర్స్‌లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. హెల్మెట్ ధరిస్తే దెబ్బలు తగిలినప్పటికీ ప్రాణాలతో బతికే అవకాశం ఉందన్నారు.
News July 6, 2025
వికారాబాద్: పప్పు దినుసులు సాగును పెంచేందుకు చర్యలు

వికారాబాద్ జిల్లాలో పప్పు దినుసుల సాగును పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తుంది. జిల్లాలో సుమారు 4.12 మంది రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కంది 665 క్వింటాళ్లు, మినుములు 4.32, జొన్నలు 26.8, జీలుగ 825, జనుము 762, రాగులు 4 క్వింటాళ్ల చొప్పున విత్తనాలను పంపిణీ చేశారు.