News February 11, 2025

ఐనవోలు: పాడి పశువులపై మళ్లీ దాడి చేసిన హైనాలు!

image

HNK జిల్లా ఐనవోలు మండలంలోని గరిమెళ్లపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా పాడి పశువులపై హైనా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి మళ్లీ పొలం వద్ద ఉన్న ఎడ్లపై దాడి చేయడంతో కొమ్ములతో హైనాలను పొడవపోయాయి. ఈ క్రమంలో ఎడ్లకు పలుచోట్ల గాయాలు అయ్యాయి. పాక వద్ద పడుకున్న ప్రభాకర్ వివరాల ప్రకారం.. రెండు హైనాలు వచ్చాయి. తనపై కూడా దాడి చేయగా కర్రలతో బెదిరించినట్లు తెలిపాడు. 

Similar News

News February 11, 2025

MHBD: అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠినచర్యలు : SP

image

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామానాథ్ కేకన్ ఆకేరు నది పరివాహక ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. ఇసుకను అక్రమరవాణా చేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయని క్షేత్రస్థాయిలో పర్యటించామన్నారు. ఇక నుంచి అనుమతులు లేకుండా ఎవరు కూడా ఇసుకను తరలించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 11, 2025

అరసవల్లి ఆదిత్యుని హుండీ లెక్కింపు

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు అధికారులు తెలిపారు. నగదు రూపంలో రూ.64,39,016 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ పేర్కొన్నారు. అలాగే 17.4గ్రాముల బంగారం, 1.212కేజీ వెండి వచ్చిందని వెల్లడించారు.

News February 11, 2025

జేఈఈ రిజల్ట్స్: ఏపీ, టీజీ విద్యార్థులకు 100 పర్సంటైల్

image

జేఈఈ మెయిన్ తొలి సెషన్ <<15430043>>ఫలితాల్లో<<>> తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన గుత్తికొండ మనోజ్ఞ, తెలంగాణకు చెందిన బనిబ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు. ఏపీ విద్యార్థి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్‌కు 99.99 పర్సంటైల్ వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది 100 పర్సంటైల్ సాధించారు.

error: Content is protected !!