News February 3, 2025
ఐనవోలు: భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో పూజలు

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం అమ్మవారి ఏకాదశ వార్షికోత్సవం, వసంత పంచమి సందర్భంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, అమ్మవారికి నవకలశస్నపన, పంచామృత, నవరస, సుగంధపరిమళ ద్రవ్యాభిషేకం, చండీహవనం, మహనివేదన, నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
బౌద్ధమత గురువు దలైలామా 90వ జన్మదినం

బౌద్ధమత అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా నేడు 90వ జన్మదినం జరుపుకుంటున్నారు. టిబెట్‌లోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన టెన్జింగ్ గ్యాట్సో కేవలం ఐదేళ్ల వయసులోనే 14వ దలైలామా అయ్యారు. చైనా ఆక్రమణ తర్వాత 1959లో ఇండియాకి నిర్వాసితుడిగా వచ్చారు. తన సందేశాలతో 1989లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ‘మనసు ప్రశాంతంగా ఉంటే, ప్రపంచమూ ప్రశాంతంగా ఉంటుంది’ అన్న ఆయన మాటలు ఇప్పుడు అన్ని దేశాలకు అవసరం.
News July 6, 2025
ప్రజాప్రతినిధుల సమాచారం సేకరిస్తున్న ప్రభుత్వం

TG: స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని అన్ని జిల్లాల CEOలు, DPOలను ప్రభుత్వం ఆదేశించింది. వార్డు సభ్యుడు, సర్పంచి, MPTC, MPP, ZPTC, ZP ఛైర్మన్ల కులం, ఉపకులం, పార్టీ తదితర వివరాలను రేపటిలోగా సమర్పించాలని పేర్కొంది. గతేడాది చేపట్టిన సర్వే డేటాను విశ్లేషించడానికి ప్రభుత్వం ఓ స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి అవసరమైన సమాచారం కోసమే వివరాలను సేకరిస్తోంది.
News July 6, 2025
ఉపవాసంతో ఎన్ని లాభాలంటే?

పుణ్యం కోసం చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*శరీరం డీటాక్సిఫై అవుతుంది
*జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
*ఉపవాసంలో పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది
*శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు