News December 17, 2025
ఐపీఎల్‌లో తెనాలి కుర్రాడు.. గుజరాత్ గూటికి పృథ్వీరాజ్

ఐపీఎల్ వేలంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ క్రికెటర్ యర్రా పృథ్వీరాజ్ మెరిశాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన పృథ్వీరాజ్‌ను ‘గుజరాత్ టైటాన్స్’ జట్టు దక్కించుకుంది. వేలంలో అతన్ని రూ.30 లక్షల ధరకు గుజరాత్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ జట్ల తరఫున ఉన్న పృథ్వీరాజ్.. ఇప్పుడు గుజరాత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో తెనాలి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 15, 2026
NTR: నగ్న చిత్రలు SMలో పెడతానని బెదిరింపు.. చివరికి..!

నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని మహిళను బెదిరించి నగదు వసూలు చేస్తున్న బాల వెంకటేశ్వర్లును భవానిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. భయపడి గతంలోనే బాధితురాలు పలుమార్లు నిందితుడికి నగదు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
News April 15, 2026
US-ఇరాన్ చర్చలపై వాన్స్ కీలక వ్యాఖ్యలు

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నమ్మకం లేకపోవడమే పెద్ద అడ్డంకి అని JD వాన్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్‌ఫైర్‌ను పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మార్చడం పెద్ద ఛాలెంజ్ అన్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న విభేదాలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావని స్పష్టం చేశారు. మరోసారి ఇరుపక్షాలు చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
News April 15, 2026
IIGMలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టులు

కాంట్రాక్ట్ పద్ధతిలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజం (IIGM), నవీ ముంబై.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 60% మార్కులతో MSc పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 27 ఏళ్లు మించకూడదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు – రూ.100. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి 30-4-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు iigm.res.in/careers చూడండి.


