News April 6, 2024
ఐపీఎల్ మ్యాచ్‌లో ఉమ్మడి జిల్లా మంత్రులు
శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు సందడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హీరో వెంకటేష్‌లతో కలిసి మ్యాచ్ వీక్షించారు. అనంతరం హైదరాబాద్ జట్టు గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News December 24, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్
☞వీణవంక: వ్యక్తిపై గొడ్డలితో దాడి ☞శంకరపట్నం: రెండు RTC బస్సులు ఢీ.. తప్పిన ప్రమాదం ☞వీణవంక: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి ☞రామడుగు: అనారోగ్యంతో AR హెడ్ కానిస్టేబుల్ మృతి ☞రాయికల్: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ☞రుద్రంగి: మైనర్ తల్లిపై కేసు నమోదు ☞ముస్తాబాద్: గుండెపోటుతో వ్యక్తి మృతి ☞కథలాపూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత.
News December 24, 2024
కరీంనగర్: దివ్యాంగులకు జాబ్ మేళా
కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో గ్రాస్ రూట్ అకాడమీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో 27 డిసెంబర్ 2024న దివ్యాంగుల కోసం ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారి కె సబితా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని, 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.
News December 24, 2024
వరిధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులేనని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి, దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టారని రాసుకొచ్చారు.