News March 27, 2025
ఐ.పోలవరం: అత్తింటి వేధింపులు..4 నెలల గర్భిణి సూసైడ్

తాళ్లరేవులోని గండివారిపాలెంలో 4 నెలల గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరంలోని జి. వేమవరానికి చెందిన ప్రవళ్లిక (21)కు తాళ్లరేవుకు చెందిన రాంబాబుతో ఏడాది క్రితం పెళ్లైంది. కొన్ని నెలలుగా అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధిస్తున్నారని యువతి తండ్రి ఆరోపించారు. దీంతో గర్భిణి అయిన తన కుమార్తె ఆత్నహత్య చేసుకుందని విలపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 28, 2026
జంగారెడ్డిగూడెంలో వ్యక్తి ఆత్మహత్య

జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన దొడ్డిగర్ల నరసింహ కుటుంబ కలహాల నేపథ్యంలో శనివారం ఉరివేసుకున్నాడు. మృతుడు రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 28, 2026
వేములవాడ డీఎస్పీగా శ్రీనివాసులు

వేములవాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా ఏ.శ్రీనివాసులు నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ సీపీటీసీలో ఏసీపీగా పనిచేస్తున్న ఆయనను వేములవాడ డీఎస్పీగా బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సాయి రుత్విక్ ను ఉట్నూర్ ఏఎస్పీగా బదిలీ చేసినట్లు సమాచారం.
News February 28, 2026
కామారెడ్డి: ఉపాధి కూలీలతో కలిసి కాంగ్రెస్ నేతల పని

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగఠన్ సృజన్ అభియాన్ 8వ రోజు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా మదనపల్లిలో శనివారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. మన్రేగా (ఉపాధి హామీ) పథక పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో కూలీలతో కలిసి పని చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


