News December 24, 2025

ఐ పోలవరం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

image

రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం జంక్షన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రంపచోడవరం వైపు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు యువకులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 24, 2025

ఆరావళి మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం

image

ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ‘SAVE ARAVALI’ అంటూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. ఈక్రమంలోనే కేంద్రం వెనక్కి తగ్గింది.

News December 24, 2025

సిరిసిల్ల: ‘వాలీబాల్‌కు పూర్వవైభవం తీసుకురావాలి’

image

జిల్లాలో వాలీబాల్ క్రీడను అగ్రపథంలో నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ఉపాధ్యక్షుడు సంఘ స్వామి, మైలారం తిరుపతి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కోరారు. బుధవారం వారు ఎమ్మెల్యేను కలిసి జిల్లాలో వాలీబాల్ క్రీడకు పూర్వవైభవం తీసుకురావాలని,  గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

News December 24, 2025

నాంపల్లి లక్ష్మీనరసింహుడి హుండీ ఆదాయం రూ.15.47 లక్షలు

image

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దత్తత దేవాలయమైన శ్రీ నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించగా రూ.15,47,828 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి 9 నెలల కాలంలో వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు పేర్కొన్నారు.