News March 13, 2025
ఐ.పోలవరం: రోడ్డు ప్రమాదంలో తోబుట్టువులకు పుత్ర శోకం

ఐ.పోలవరం మండలం ఎదురులంక వారధిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తోబుట్టువుల కొడుకులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముమ్మిడివరం M కొత్తలంకకు చెందిన సాంబశివ (14), తాళ్ళరేవు M సుంకరపాలానికి చెందిన వీరేంద్ర (18) మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్ పై వస్తున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సాంబశివ 9వ తరగతి చదువుతుండగా వీరేంద్ర మినీ ఆటో యజమాని.
Similar News
News March 13, 2025
WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం మక్కలు (బిల్టి) క్వింటాకు రూ.2,310 ధర పలకగా.. బుధవారం రూ.2,305కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.10 తగ్గి రూ.2,300కి పడిపోయింది. అలాగే సూక పల్లికాయ క్వింటాకి రూ.7,150 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News March 13, 2025
VZM: 15,226 మంది లబ్ధిదారులకు గుడ్ న్యూస్

నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయంతో జిల్లాలో 15,226 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. 12,240 మంది బీసీలకు, 2,231 మంది ఎస్సీలకు ఒక్కో ఇంటికి రూ.50 వేలు, 565 మంది షెడ్యూల్డు తెగల వారికి రూ.75 వేలు, 190 మంది ఆదిమ తెగలకు రూ.లక్ష చొప్పున సహాయం అందనుంది.
News March 13, 2025
రేపు హోళీ.. ములుగు ఎస్పీ వార్నింగ్!

హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని ములుగు ఎస్పీ శబరిశ్ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇతరులపై బలవంతంగా రంగులు వేయకుండా, పరస్పర గౌరవంతో పండుగా జరుపుకోవాలన్నారు. బలవంతంగా రంగులు పూయడం, శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడం నేరమన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సంప్రదించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దన్నారు.