News July 11, 2025
ఒంగోలుకు రావడానికి ఇబ్బందులు..!

ప్రకాశం జిల్లాలోని పలు పల్లెల నుంచి ఒంగోలు రావడానికి సరైన సమయాల్లో బస్సులు లేవు. ఉదయం వేళలో స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులు సైతం బస్సుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఉదయాన్నే 6 గంటలకు బస్సులు వస్తున్నాయి. ఆ తర్వాత 10పైనే బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. 8 గంటల ప్రాంతంలో బస్సులు తిప్పాలని పలువురు కోరుతున్నారు. మీ ఊరికి ఇలాగే బస్సు సమస్య ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News August 31, 2025
గిద్దలూరు: జడ్జికి అసభ్య పదజాలంతో లెటర్

జడ్జిలను దూషించిన ఓ వ్యక్తికి రిమాండ్ పడింది. గిద్దలూరు జడ్జికి ఆగస్ట్ 28వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ రిజిస్ట్రర్ పోస్ట్ వచ్చింది. అది తెరిచి చూడగా అసభ్యపదజాలంతో మేటర్ ఉంది. జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు కోర్టులోనే అటెండర్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఈ లెటర్ రాసినట్లు గుర్తించారు. అతడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ ఉత్తర్వులు ఇచ్చారు.
News August 31, 2025
తర్లుపాడు PSను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

తర్లుపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలు పరిశీలించి, స్టేషన్ రికార్డులు, నేరాల చరిత్ర, కేసుల పురోగతి, పోలీసు సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో SI బ్రహ్మ నాయుడు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
News August 30, 2025
రేపు ఒంగోలుకు రానున్న MP మాగుంట

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం ఒంగోలుకు రానున్నట్లు ఎంపీ మాగుంట కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు ఒంగోలులోని తన కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అలాగే ఒంగోలులో జరిగే కార్యక్రమాలలో ఎంపీ మాగుంట రేపు పాల్గొంటారన్నారు. అంతేకాకుండా ఒకటో తేదీ సోమవారం కూడా ఎంపీ మాగుంట తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.