News December 2, 2024
‘ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి’
ఒంగోలు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుకు రూ.700 కోట్లు కేటాయించాలని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. వర్షం వస్తే మురుగు కాలువలు పొంగి రోడ్ల మీదకు చేరుతుందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణమేనని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నేత రమేశ్ పాల్గొన్నారు.
Similar News
News December 26, 2024
ప్రకాశం: 6,481 హెక్టార్లలో పంట నష్టం
ఈ నెల 24 నుంచి 26 వరకు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో మొత్తం 6,481 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
News December 26, 2024
శానంపూడిలో యువతి ఆత్మహత్య
సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2024
బాపట్ల: రేపు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్
బాపట్ల జిల్లాలో ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ను జిల్లాలోని ఎస్టీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.