News April 2, 2025
ఒంగోలులో ఇలా చేస్తున్నారా..?

ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ఏకకాలంలో దాడులు చేశారు. ఒంగోలు తాలుకా PS పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేయగా.. బహిరంగంగా మద్యం తాగుతూ ముగ్గురు పట్టుబడ్డారు. ఇలాగే బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News March 2, 2026
ప్రకాశం: కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన ఒంగోలు యువకుడు హేమంత్ (17) మృతదేహం లభ్యమైంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ టీం సాయంతో గాలింపు చేపట్టగా, సోమవారం ఈర్నపాడు దగ్గర శవం దొరికినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
News March 2, 2026
మార్కాపురంలో కొత్త కొలువులు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

మార్కాపురంలోని కొత్త వన్ స్టాప్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి పద్మావతి ఆదివారం తెలిపారు. అర్హత గల మహిళా అభ్యర్థులు మార్చి 11 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు జిల్లా వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు తీసుకుని, సర్టిఫికెట్లు జతచేసి జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
News March 2, 2026
ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: మంత్రి స్వామి

అంగన్వాడీ కార్యకర్తలు, చిరుద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్వామి ఆదివారం తెలిపారు. చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీ వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత CM చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.


