News August 31, 2024

ఒంగోలులో ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై తాజా UPDATE

image

ఒంగోలులో ఎయిర్ పోర్టు నిర్మాణ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇటీవల కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒంగోలులో ఎయిర్ పోర్టు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ దశలో కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల వద్ద 723 ఎకరాల భూమిని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇది ఒంగోలు, కొత్తపట్నం తీర ప్రాంతానికి సమాన దూరం ఉండనుంది. దీంతో తీర ప్రాంత ప్రజలకు సైతం ఎయిర్ పోర్టు సేవలు దగ్గర కానున్నాయి.

Similar News

News December 14, 2025

ప్రకాశం: కొద్ది దూరమే కదా అనుకుంటే.. ప్రాణానికే ప్రమాదం

image

ప్రకాశం జిల్లాలోని వాహనదారులకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఐటీ విభాగం పోలీసులు కీలక సూచనలు చేశారు. కొద్ది దూరమని రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. దూరంకంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని వాహనదారులు గమనించాలని కోరారు. రాంగ్ రూట్ వెళ్లకుండా వాహనదారులు సహకరించాలన్నారు. కాదని అతిక్రమిస్తే కఠిన చర్యలు, జరిమానాలు విధిస్తామన్నారు.

News December 14, 2025

ప్రకాశం:10th విద్యార్థులకోసం ఇలా..!

image

ప్రకాశం జిల్లాలో 10వ తరగతి విద్యార్థులపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా నిర్వహించాలని ఒంగోలు డిప్యూటీ డిఈఓ చంద్రమౌళీశ్వర్ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గల పీజీఆర్ఎస్ హాలులో శనివారం ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు నియోజకవర్గాల హెచ్ఎం, ఎంఈఓలకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు. ప్రతి పాఠశాలలోని విద్యార్థులు 100% పాస్ అయ్యేలా లక్ష్యాన్ని ఎంచుకొని, ప్లాన్ అమలు చేయాలన్నారు.

News December 14, 2025

ప్రకాశంలో నవోదయకు పరీక్షకు 1998 మంది గైర్హాజరు

image

ప్రకాశం జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 1998 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. ఒంగోలులోని నవోదయ విద్యాలయ వద్ద ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఆరో తరగతి ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. మొత్తం 5,502 మంది విద్యార్థులకు గాను, 3,504మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.