News August 19, 2024
ఒంగోలులో టెన్షన్ టెన్షన్

ఒంగోలులో ఈరోజు నుంచి 24 వరకు రీ మాక్ పోలింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారు. ఈవీఎంలు, ఓటింగ్ సరళిపై అనుమానాలు ఉన్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి అభ్యంతరం తెలపడంతో అధికారులు మాక్ పోలింగ్‌కు ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలోని మొత్తం 12 కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. దీంతో ఏం జరగనుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Similar News
News February 14, 2026
సింగరాయకొండ: బీచ్ ఫెస్టివల్ మ్యాప్‌ను విడుదల చేసిన అధికారులు

సింగరాయకొండ మండలం పాకలలో జరిగే బీచ్ ఫెస్టివల్‌కు అధికారులు మ్యాప్ విడుదల చేశారు. పార్కింగ్ జోన్ బీచ్ సమీపానికి ఎడమవైపు కేటాయించారు. అక్కడి నుంచి ఉత్సవ ప్రాంగణానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. కాగా.. సాగర్ తీరానికి వెళ్లేందుకు 3 ప్రధాన రహదారులు ఏర్పాటు చేయగా.. వీవీఐపీలకు మరో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. కాగా ఫుడ్ జోన్, షాపింగ్ జోన్, ఫెస్టివల్‌కు ఆకర్షణీయం కాగలవని అంటున్నారు.
News February 13, 2026
అసెంబ్లీలో మార్కాపురం MLA సంచలన వ్యాఖ్యలు

తమ జాయింట్ కలెక్టర్(JC) సరిగా పనిచేయడం లేదని మార్కాపురం MLA కందుల అన్నారు. ‘తర్లుపాడు(M) పూతలపాడు రైతుల భూముల వివరాల్లో ఊరి పేరు పోతవరంగా మార్చారు. దీంతో ఆ భూములు దేవదాయ శాఖవిగా మారడంతో అమ్ముకోలేకపోతున్నారు. దీనిపై 67 అర్జీలు ఇస్తే ఒక్కటీ పరిష్కరించలేదు. దీంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మా జిల్లాలో JCకు 1100 ఫైల్స్ వస్తే 100 పరిష్కరించి మిగిలినవి చెత్తలో పడేశారు’ అని MLA ఆరోపించారు.
News February 13, 2026
ఒంగోలు: రేపటి నుంచే బీచ్ ఫెస్టివల్.. టైమింగ్స్ ఇవే!

ప్రకాశం జిల్లా పాకలలో బీచ్ ఫెస్టివల్ ఈనెల 14, 15వ తేదీల్లో జరగనుంది. 14వ తేదీ ఉదయం 9గంటల నుంచి రాత్రి 11గంటల వరకు, 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ఉదయం 9గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజా బాబు చెప్పారు. హెలికాప్టర్ రైడింగ్, ఫుడ్ కోర్టులు, ఎగ్జిబిషన్లు ఉంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు.


