News November 17, 2024
ఒంగోలులో తీవ్ర విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి
ఒంగోలు నగర సమీపంలోని కొప్పోలు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురూ ఒకే స్కూటీపై వెళ్తుండగా మంచినీటి ట్యాంకర్‌ను ఢీకొన్నారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు.
Similar News
News November 17, 2024
ఒంగోలు పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో గేమ్‌ల వివరాలు ఇవే
ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులకు వాలీ బాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌తోపాటు అథ్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ డిస్కస్ త్రో, మహిళలకు వాలీ బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలతోపాటు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నారు.
News November 16, 2024
ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జ్ ఎవరంటే..?
ఒంగోలు మాజీ MLA బాలినేని శ్రీనివాసరెడ్డి YCPని వీడి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చుండూరి రవిబాబును YCP ఒంగోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. దీంతో ఆయన నేపథ్యం ఏంటని అందరూ ఆరా తీస్తున్నారు. సీనియర్ NTరామారావు హయాంలో టీడీపీలోకి ప్రవేశించారు. 2004, 2009లో TDP టికెట్ ఆశించినా రాలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపుతో YCPలో చేరారు. ఇతని స్వస్థలం నాగులుప్పలపాడు మండలం.
News November 16, 2024
మాజీ MLA టీజేఆర్‌కు కీలక బాధ్యతలు
ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు సంతనూతలపాడు మాజీ MLA టీజేఆర్ సుదాకర్ బాబు, వెంకట రమణా రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌ను సమన్వయం చేసుకుంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.