News March 24, 2025

ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

image

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.

Similar News

News January 6, 2026

ప్రకాశం, మార్కాపురం జిల్లాలు.. అసలు రూపం ఇదే!

image

ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి భౌగోళిక స్వరూపాన్ని అధికారులు రూపొందించారు. ప్రకాశం జిల్లా 28 మండలాలు, 520 గ్రామాలతో ఉండగా.. మార్కాపురం జిల్లా 21 మండలాలతో 508 గ్రామాలతో స్వరూపాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇక విస్తీర్ణం విషయంలో ప్రకాశం జిల్లా 15,58,828.77 ఎకరాలు, మార్కాపురం 14,82,757.24 ఎకరాలు ఉంది.

News January 5, 2026

కనిగిరి: మహిళను హత్య చేసి.. ప్రియుడి సూసైడ్

image

వెలిగండ్ల(M) కట్టకిందపల్లిలో సోమవారం వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. DSP సాయి ఈశ్వర్ వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన సీనావలి కట్టకిందపల్లికి చెందిన నాగజ్యోతికి వివాహేతర సంబంధం ఉండగా సోమవారం సీనావలి ఆమెతో <<18769740>>గొడవపడి హత్య<<>> చేశాడు. గ్రామస్థులకు బయపడి సీనావలి కూడా విష ద్రావణం తాగడంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News January 5, 2026

కనిగిరి వద్ద మహిళ దారుణ హత్య.!

image

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో సోమవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టామని మరన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని SI కృష్ణ పావని తెలిపారు. హత్యకు గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.