News July 7, 2024
ఒంగోలు: ఆకతాయిని స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు

కారుకు పోలీసు హారన్ బిగించి ఒంగోలు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ భయాందోళనలకు గురి చేసిన ఓ ఆకతాయికి స్థానికులు శనివారం దేహాశుద్ధి చేశారు. పేర్నమిట్టకు చెందిన రవి ఇటీవలే కొత్త కారు కొని 4 రోజుల నుంచి పగలు రాత్రీ తేడాలేకుండా తిరుగుతున్నాడు. రోడ్డుపై వెళుతున్న ఒక మహిళకు అతి సమీపంలో కారు తీసుకెళ్లి ఆటపట్టించాడు. ఆగ్రహానికి గురైన మహిళ, స్థానికులు అతనిని పట్టుకొని తాళ్లతో కట్టేసి చితకబాదారు.
Similar News
News September 14, 2025
SP దామోదర్‌కు వీడ్కోలు

ప్రకాశం జిల్లా SP దామోదర్ ఐపీఎస్ విజయనగరానికి బదిలీ అయ్యారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 నెలల పాటు SPగా విశేష కృషి చేశారని పోలీస్ అధికారులు కొనియాడారు. ప్రత్యేక వాహనంలో వెళ్లిన దామోదర్‌కు పోలీసులు గౌరవ సెల్యూట్ చేశారు. పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
News September 14, 2025
బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత!

ఎమ్మెల్సీ పోతుల సునీత ఆదివారం BJPలో చేరారు. విశాఖలో జరుగుతున్న సారథ్యం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉన్న పోతుల సునీత BJPలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
News September 14, 2025
కందుకూరు: కరేడులో టెన్షన్..టెన్షన్..

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు (M) కరేడులో ఆదివారం అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంక్షల నడుమ బోడె రామచంద్ర యాదవ్ మీటింగ్ జరగాల్సి ఉండటంతో పరిణామాలు ఎలా దారి తీస్తాయో అన్న టెన్షన్ అందరిలో ఏర్పడింది. జూలై 29న జరిగిన హైవే దిగ్బంధం కార్యక్రమంలో కూడా బోడె రామచంద్ర వెంట అనూహ్యంగా వేలాది మంది కరేడు ప్రజలు దూసుకొచ్చిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.