News March 30, 2025
ఒంగోలు: ఈనెల 31న పోలీస్ గ్రీవెన్స్ రద్దు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. ఈనెల 31వ తేదీన రంజాన్ (ప్రభుత్వ సెలవు దినం) పండుగ అయినందున మీకోసం కార్యక్రమం రద్దు అయినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎస్పీ కార్యాలయానికి రావద్దని సూచించారు.
Similar News
News April 1, 2025
రేపు ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన

ఒంగోలు కలెక్టరేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్ ఎర్రయ్య మంగళవారం తెలిపారు. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే 30% ఐఆర్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. సీపీఎస్, జీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు
News April 1, 2025
ప్రకాశం: నేటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నట్లు ప్రకాశం జిల్లా అధికారులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 1 నుంచి ప్రారంభం కావలసిన ఇంటర్ తరగతులు ఈ ఏడాది 2 నెలల ముందే ప్రారంభమయ్యాయి.
News April 1, 2025
ప్రకాశం: నేడు సోషల్ పరీక్ష

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్ పరీక్షను షెడ్యూల్ ప్రకారం మంగళవారం నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. విద్యార్థులు ఎలాంటి అనుమానాలు లేకుండా పరీక్షకు హాజరు కాగలరన్నారు.