News March 20, 2024

ఒంగోలు: ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి

image

ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. ఒంగోలులోని కలెక్టర్ పరిపాలనా భవనంలో ఎన్నికల సిబ్బందికి మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పారు. అవసరమైన సామగ్రిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని చెప్పారు.

Similar News

News April 20, 2025

బేస్తవారిపేట: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

image

బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పెద్ద ఓబులేనిపల్లికి చెందిన ఆకాశ్, సన్నీగా గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News April 20, 2025

ప్రకాశం: భార్యను హతమార్చిన భర్త

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2025

ప్రకాశం: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది

image

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 24 రోజులు పెళ్లిళ్లకు మంచి గడియలు ఉన్నాయి. మండు వేసవి అయినప్పటికీ మంచిగడియల్లో పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో ప్రకాశం జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో కేవలం వివాహాల మీదనే రూ.30 కోట్ల వ్యాపారాలు జరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక కళ్యాణ మండపాలు, గోల్డ్, బట్టల షాపులు సందడిగా మారాయి.

error: Content is protected !!