News October 10, 2025

ఒంగోలు: ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించాలని వినతి

image

సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. ఒంగోలు సమీపంలో ఎయిర్‌పోర్ట్ పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 39 రోడ్ల పునర్నిర్మాణానికి రూ.135 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఒంగోలులో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపైనా సీఎంతో మాట్లాడారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

Similar News

News October 10, 2025

PKSM: తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా..?

image

తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ కోర్ పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. కేవైసీ పేరుతో జరిగే మోసాల పట్ల చైతన్యపరుస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ బ్యాంక్ కూడా కేవైసీ గురించి కాల్స్ చేసి ఓటీపీ అడగదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

News October 10, 2025

కనిగిరి: సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ పూర్తి

image

మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ పూర్తయినట్లు ప్రకాశం డీఈవో కిరణ్‌కుమార్‌ తెలిపారు. కనిగిరిలోని ఆల్ఫా అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో 124 మంది సెకండరీ గ్రేడ్‌ తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైనట్లు తెలిపారు. సదరు టీచర్లు సోమవారం నుంచి వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరతారన్నారు.

News October 10, 2025

ఒంగోలు: నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్‌

image

జిల్లాలోని ఆస్పత్రుల్లో NTR వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. జిల్లాలోని ఆస్పత్రులకు రూ.150 కోట్ల వరకు బిల్లులు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 120కిపైగా ప్రైవేటు ఆస్పత్రులు ఈ సేవలందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ వైద్యులు కొంతకాలంగా బకాయిల కోసం పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. దీంతో శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.‌